News August 23, 2025

అర్చకులు, ఈవోల‌కు ప‌దోన్న‌తులు

image

TG: దేవదాయ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఆల‌యాల అర్చ‌కులు, ఈవోలకు ప‌దోన్న‌తులు లభించాయి. ప‌దోన్న‌తి పొందిన అర్చ‌కులు, ఈవోల‌కు మంత్రి కొండా సురేఖ ఆర్డ‌ర్ కాపీల‌ను స‌చివాల‌యంలో అంద‌జేశారు. దేవదాయ శాఖ‌లో పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.4లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచ‌డానికి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి సురేఖ కృషి చేశారని అర్చకుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

Similar News

News August 24, 2025

13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు

image

TG: సూర్యాపేట(D) నడిగూడెం PSలో పనిచేసే కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్యపెళ్లి కొడుకు అవతారమెత్తాడు. ముగ్గురికి విడాకులిచ్చిన రాజు రెండేళ్ల క్రితం 13 ఏళ్ల బాలికను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అతని అసలు రూపం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

News August 24, 2025

సంపన్న సీఎంగా చంద్రబాబు.. ఎలా అంటే?

image

చంద్రబాబు 1992లో రూ.7వేల పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్థాపించారు. 1994లో IPOకు వెళ్లగా రూ.6.5 కోట్లు సమకూరాయి. 1995లో దీని మార్కెట్ వాల్యూ రూ.25 కోట్లు ఉండగా 2025లో రూ.4,500 కోట్లకు చేరింది. చంద్రబాబు 1994లో మంత్రి కాగానే తన భార్య భువనేశ్వరికి హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. దీన్ని చంద్రబాబు సంపదగా పరిగణించడంతో ఆయన దేశంలో అత్యంత <<17489958>>సంపన్న<<>> CMగా నిలిచారు.

News August 24, 2025

సల్వాజుడుం గురించి తెలుసా?

image

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల ఏరివేతకు ప్రభుత్వం 2005లో ‘సల్వాజుడుం’ విధానాన్ని తీసుకొచ్చింది. గిరిజనులను పోలీసులుగా నియమించి, వారికి ఆయుధాలు సమకూర్చడమే దీని లక్ష్యం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు పిటిషన్ వేశారు. దీంతో సుదర్శన్ రెడ్డి జడ్జిగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ సల్వాజుడుంను రద్దు చేసింది. ఈ విధానం ఉంటే 2020లోపే నక్సలిజం అంతమయ్యేదని <<17494765>>అమిత్ షా<<>> సుదర్శన్ రెడ్డిని విమర్శించారు.