News August 23, 2025
తిరుపతి: ఒకే వ్యక్తికి 5 ప్రభుత్వ ఉద్యోగాలు

పుత్తూరుకు చెందిన వ్యక్తి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గజేంద్ర, రత్న దంపతులకు మహేష్, వినోద్, మోహన్ ముగ్గురు సంతానం. చిన్నతనంలో భర్తను కోల్పోయిన ఆమె తన తల్లి వద్ద ముగ్గురిని వదిలి కువైట్‌కు జీవనోపాధి కోసం వెళ్లింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన మోహన్ SA సోషల్‌లో 23వ ర్యాంకు, తెలుగులో 27, SGTలో 26, TGT లో 35వ ర్యాంకు సాధించారు. ఇటీవల వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో సైతం 3వ ర్యాంకు వచ్చింది.
Similar News
News August 24, 2025
సంగారెడ్డి: వసతి గృహలకు రూ.3.30 కోట్లు

సంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ మరమ్మతులకు రూ.3.30 కోట్ల నిధులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఆదివారం తెలిపారు. 33 వసతి గృహాలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో వసతి గృహానికి రూ.10 లక్షల చొప్పున మంజూరైనట్లు పేర్కొన్నారు. సివిల్ వర్క్, ఎలక్ట్రికల్, ప్రహరీ గోడలు, బాత్రూం, టాయిలెట్ రిపేరింగ్, పెయింటింగ్ వంటివి చేయిస్తామని వివరించారు.
News August 24, 2025
‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!
News August 24, 2025
సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

సెప్టెంబర్‌లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. 5న క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, అదే రోజున మురుగదాస్-శివకార్తికేయన్ ‘మదరాసి’, 12న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ కానున్నాయి. తేజా సజ్జ ‘మిరాయ్’ 12న లేదా 19న విడుదలవుతుందని సమాచారం. 25న పవన్ కళ్యాణ్ ‘OG’ రాబోతోంది. రవితేజ ‘మాస్ జాతర’ నెలాఖరులో లేదా OCTలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.