News August 23, 2025
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్, భట్టి, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు, ఈ నెల 29న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని PAC భేటీలో నిర్ణయించారు.
Similar News
News August 24, 2025
సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

సెప్టెంబర్‌లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. 5న క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, అదే రోజున మురుగదాస్-శివకార్తికేయన్ ‘మదరాసి’, 12న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ కానున్నాయి. తేజా సజ్జ ‘మిరాయ్’ 12న లేదా 19న విడుదలవుతుందని సమాచారం. 25న పవన్ కళ్యాణ్ ‘OG’ రాబోతోంది. రవితేజ ‘మాస్ జాతర’ నెలాఖరులో లేదా OCTలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.
News August 24, 2025
అలాంటి ఆరోపణలకు SC, ST చట్టం వర్తించదు: హైకోర్టు

TG: సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బహిరంగ ప్రదేశంలో జరిగిన ఘటనలకే SC, ST చట్టం వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ప్రైవేటు సంభాషణలు, వాట్సాప్/మెయిళ్లలో కులదూషణ చేశారన్న ఆరోపణలకు వర్తించదని స్పష్టం చేసింది. మాజీ భార్య, ఆమె తండ్రి గతంలో వాట్సాప్, మెయిల్‌లో దూషించారని ఓ వ్యక్తి పెట్టిన కేసును HC విచారించింది. ప్రత్యక్ష సాక్షులు లేరని, బహిరంగ ప్రదేశంలో దూషించినట్లు ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.
News August 24, 2025
13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు

TG: సూర్యాపేట(D) నడిగూడెం PSలో పనిచేసే కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్యపెళ్లి కొడుకు అవతారమెత్తాడు. ముగ్గురికి విడాకులిచ్చిన రాజు రెండేళ్ల క్రితం 13 ఏళ్ల బాలికను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అతని అసలు రూపం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.