News August 23, 2025

చోడవరం: బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. వ్యక్తి మృతి

image

చోడవరం మండలం వెంకన్నపాలెం శివారు ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరొకరు గాయపడ్డారు. అనకాపల్లి వెళుతున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చోడవరం మండలం ఎం.కొత్తపల్లికి చెందిన వి.రాము నాయుడు మృతి చెందగా, ఇదే వాహనంపై ఉన్న ఎన్.సోమ నాయుడి రెండు కాళ్లు విరిగిపోయాయని ఎస్ఐ జోగారావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News August 24, 2025

సంగారెడ్డి: వసతి గృహలకు రూ.3.30 కోట్లు

image

సంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ మరమ్మతులకు రూ.3.30 కోట్ల నిధులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఆదివారం తెలిపారు. 33 వసతి గృహాలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో వసతి గృహానికి రూ.10 లక్షల చొప్పున మంజూరైనట్లు పేర్కొన్నారు. సివిల్ వర్క్, ఎలక్ట్రికల్, ప్రహరీ గోడలు, బాత్రూం, టాయిలెట్ రిపేరింగ్, పెయింటింగ్ వంటివి చేయిస్తామని వివరించారు.

News August 24, 2025

‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

image

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!

News August 24, 2025

సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

image

సెప్టెంబర్‌లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. 5న క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, అదే రోజున మురుగదాస్-శివకార్తికేయన్ ‘మదరాసి’, 12న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ కానున్నాయి. తేజా సజ్జ ‘మిరాయ్’ 12న లేదా 19న విడుదలవుతుందని సమాచారం. 25న పవన్ కళ్యాణ్ ‘OG’ రాబోతోంది. రవితేజ ‘మాస్ జాతర’ నెలాఖరులో లేదా OCTలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.