News August 23, 2025
యూరియా కొరతపై BRS,BJP డ్రామాలు: రేవంత్

TG: యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి PAC సమావేశంలో స్పందించారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని KTR అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశాను. యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలి’ అని తెలిపారు.
Similar News
News August 24, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230, గుంటూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రూ.180గా ఉంది. అటు హైదరాబాద్‌లో రూ.190-200, వరంగల్‌లో రూ.210 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
News August 24, 2025
అదానీ సంస్థకు 1200 ఎకరాలు

AP: కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని ఆ సంస్థకు 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐదేళ్లకోసారి 10% లీజు ధర పెంచాలని నిర్ణయించింది. అటు గుంటూరు నడింపాలెంలో జాతీయ యోగా, నేచురోపతి పరిశోధనా సంస్థ ఏర్పాటుకు 12.96 ఎకరాలను ప్రభుత్వం కేంద్రానికి ఉచితంగా కేటాయించింది.
News August 24, 2025
రేపు శ్రీవారి టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆగస్టు 25న ఉ.10 గంటలకు విడుదల కానున్నాయి. రేపు మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. నిన్న వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను TTD విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు దళారులను నమ్మవద్దని, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.