News August 23, 2025
శంకరపట్నం: పశువుల పండుగ రోజే పశువుల చోరీ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో పశువుల పండుగ రోజైన శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు పశువులను ఎత్తుకెళ్లారు. బావి దగ్గరి పశువుల పాకల వద్ద ఈ చోరీ జరిగింది. బాధిత రైతులు దుఃఖంతో కన్నీటిపర్యంతమై, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 24, 2025
MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
News August 24, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230, గుంటూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రూ.180గా ఉంది. అటు హైదరాబాద్‌లో రూ.190-200, వరంగల్‌లో రూ.210 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
News August 24, 2025
నందిగామలో భారీ కొండచిలువ

నందిగామ శివారు అనాసాగరంలో రైతులకు భారీ కొండచిలువ కనిపించింది. ట్రాక్టర్ దమ్ము చేస్తుండగా కొండచిలువ కనిపించడంతో రైతు ఆందోళన చెంది దానిని హతమార్చారు. మున్నేరుకు భారీగా వరదలు రావడంతో తరచూ పాములు కొట్టుకు వస్తున్నాయని తెలిపారు. పాము కాట్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.