News August 23, 2025
జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ కేడేట్ల ఎంపిక

జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఆర్మీ పదో బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ కేడెట్ల ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎత్తు, బరువు కొలతలతో పాటు పరుగు పందెం, పుష్ అప్స్, వైద్య, రాత పరీక్షలు నిర్వహించారు. పేర్కొన్న పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులను కేడేట్లుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ అధికారులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News August 24, 2025
ఖమ్మం జిల్లాలో నాటుకోడి @400

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతుంది. స్కిన్ లెస్ చికెన్ రూ.210- 240, ఫారం మాంసం రూ.160-180, నాటుకోడి మాంసం రూ.350- 400కు పలుకుతోంది. దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత? కామెంట్ చేయండి.
News August 24, 2025
నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

నరసరావుపేటలో ఆదవారం మాంసం, కోడిగుడ్ల ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ ధర రూ. 106గా ఉంది. స్కిన్‌తో చికెన్ కేజీ రూ. 210 నుంచి రూ. 240, స్కిన్‌లెస్ అయితే రూ. 220 నుంచి రూ. 260 మధ్య విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు రూ. 10 నుంచి రూ. 20 తగ్గాయని వ్యాపారులు తెలిపారు. మటన్ కేజీ ధర రూ. 800 నుంచి రూ.900 పలుకుతోంది. అలాగే, 100 కోడిగుడ్లు రూ. 535 లభిస్తున్నాయి.
News August 24, 2025
కృష్ణా: వర్షాలకు రోడ్లు ధ్వంసం.. నష్టం ఎంతంటే.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. R&B అధికారుల అంచనాల మేరకు.. మొత్తం 333.32 కి.మీ మేర రోడ్లు పాడయ్యాయి. 14 రోడ్లు పూర్తిగా కొట్టుకుపోగా, ఒక రోడ్డు బాగా దెబ్బతింది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ. 33.09 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ. 251.38 కోట్లు. ఈ నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.