News August 23, 2025

ఐబీలో 394 జాబ్స్.. జీతం రూ.81వేలు

image

394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఇంటెలిజెన్స్ బ్యూరో నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్లికేషన్లకు సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించింది. డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. SHARE IT.

Similar News

News August 24, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230, గుంటూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రూ.180గా ఉంది. అటు హైదరాబాద్‌లో రూ.190-200, వరంగల్‌లో రూ.210 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

News August 24, 2025

అదానీ సంస్థకు 1200 ఎకరాలు

image

AP: కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని ఆ సంస్థకు 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐదేళ్లకోసారి 10% లీజు ధర పెంచాలని నిర్ణయించింది. అటు గుంటూరు నడింపాలెంలో జాతీయ యోగా, నేచురోపతి పరిశోధనా సంస్థ ఏర్పాటుకు 12.96 ఎకరాలను ప్రభుత్వం కేంద్రానికి ఉచితంగా కేటాయించింది.

News August 24, 2025

రేపు శ్రీవారి టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆగస్టు 25న ఉ.10 గంటలకు విడుదల కానున్నాయి. రేపు మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. నిన్న వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను TTD విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు దళారులను నమ్మవద్దని, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.