News August 24, 2025
HYD: తెలంగాణ సినిమా పాలసీని రూపొందించాలి: TCV

తెలంగాణలో ఆంధ్ర-తెలంగాణ సినిమా విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ సినిమా వేదిక (TCV) గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రొపుల్ రాంరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లారా, మోహన్ బైరాగి మాట్లాడుతూ.. తెలంగాణ సినిమా పాలసీని రూపొందించాలని డిమాండ్ చేశారు. మౌనిక, అంజలి పాల్గొన్నారు.
Similar News
News September 12, 2025
కూకట్‌పల్లిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

కూకట్‌పల్లిలోని 15వ ఫేజ్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార కేంద్రాన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 12, 2025
కూకట్‌పల్లిలో రేపు జాబ్ మేళా

ఐటీ, డీపీఓ ఉద్యోగాలకు సంబంధించి రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి కిషన్ తెలిపారు. కూకట్‌పల్లి ప్రభుత్వ కళాశాలలో ఈ మేళా ఉంటుందన్నారు. ఇంటర్ మీడియట్‌లో 75 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు ఈ మేళాకు హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్లు తమ వెంట కచ్చితంగా తీసుకురావాలన్నారు. వివరాలకు 76740 07616, 79818 34205 నంబర్లను సంప్రదించాలన్నారు.
News September 12, 2025
HYDలో 19 యూపీఎస్సీ పరీక్ష కేంద్రాలు

HYDలో ఈనెల 14న యూపీఎస్సీ పరీక్షలు 19 కేంద్రాల్లో జరుగనున్నాయి. కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్-2, నేవల్ అకాడమి నేషనల్ డిఫెన్స్ అకాడమి-2 పరీక్షలు, నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు 7688 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థులు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావాలని హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి సూచించారు.