News August 24, 2025

HYD: కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYDలోని 2025-26 విద్యా సంవత్సరానికి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ (COE)TMR జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హులైన బాలికల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ ఈరోజు తెలిపారు. HYD జిల్లాలోని TMR జూనియర్ కళాశాలల్లో నిర్ణీత ఫార్మాట్స్ ఆఫ్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Similar News

News August 24, 2025

HYD: నిమజ్జనానికి 74 కొలనులు

image

గణేశ్ విగ్రహాల నిమజ్జనాలకు GHMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న విగ్రహాలను నిమజ్జనాలు చేసేందుకు ప్రత్యేక కొలనులతో పాటు ప్రీ ఫ్యాబ్రిక్ ట్రెడ్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనులను దీనికి వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్‌లో 13, చార్మినార్‌లో 9, ఖైరతాబాద్‌లో 13, శేరిలింగంపల్లిలో 15, కూకట్‌పల్లిలో 12, సికింద్రాబాద్‌లో 12 ఏర్పాటు చేయనున్నారు.

News August 24, 2025

GHMC ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

image

గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని మట్టి గణపతి విగ్రహాల పంపిణీ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ఏడాది 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ విగ్రహాలు ఆగస్టు 25, 26 తేదీలలో జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. పర్యావరణ హితమైన గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని ప్రజలకి సూచించారు.

News August 24, 2025

HYD: ‘సహస్ర చెల్లి లాంటిది.. తప్పు చేయలేదు: వెంకట్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్‌కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్‌ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.