News August 24, 2025

HYD: ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లపై కేసు నమోదు

image

సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ దగ్గరికి వెళ్లిన ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లపై కేసు నమోదైంది. సైఫాబాద్ పీఎస్‌లో సీఐ ఫిర్యాదుతో 11 మంది కాంట్రాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. ఇది కాంట్రాక్టర్లను భయపెట్టే, గొంతు నొక్కే కుట్ర మాత్రమే అని కాంట్రాక్టర్లు చెప్పారు. మమ్మల్ని కేసులతో బెదిరిస్తే వెనక్కి తగ్గమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రాక్టర్లపై పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.

Similar News

News August 24, 2025

HYD: యువత చూడాల్సిన సినిమా.. పేపర్ లీక్: MLA

image

పేపర్ లీకుల వల్ల విద్యార్థి, నిరుద్యోగులకు జరిగే నష్టాలు, నాణ్యత లేని విద్య వల్ల యువత ఎదుర్కొనే ఇబ్బందులను యూనివర్సిటీ పేపర్ లీకు సినిమాలో డైరెక్టర్ నారాయణమూర్తి అద్భుతంగా చూపించారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. HYDలో సినిమాపై మీడియాతో మాట్లాడిన ఆయన యువత అందరూ చూడాల్సిన సినిమా అని కొనియాడారు.

News August 24, 2025

HYD: కష్టాలతో కునుకు రాక.. ఇంటికెళ్లలేక..!

image

సముద్రాలైనా ఈదొచ్చుకానీ కుటుంబ కష్టాల కడలిని ఈదలేం అనే పెద్దల మాటకు ఈయన పరిస్థితి నిలువుటద్దం. ఉప్పల్‌లో ఫుట్‌పాత్‌పై పడుకున్న ఓ వ్యక్తిని కదిలిస్తే..‘రాత్రి నిద్ర పట్టడం లేదు. సుక్కేసి పడుకుందామని ఇంటికెళ్తే కుటుంబ కష్టాలు గుర్తొచ్చి బాధైతుంది’ అంటూ రాత్రికి అక్కడే కునుకు తీస్తున్నట్లు తెలిపారు. మధ్యతరగతి కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంత కష్టమో ఆ వ్యక్తి చెబుతుంటే పలువురు తదేకంగా విన్నారు.

News August 24, 2025

ఒడిశా గోల్డెన్ బీచ్‌లో HYD యువకుడి గల్లంతు

image

ఒడిశాలోని పూరి సముద్రంలో లంగర్‌హౌస్‌లోని జానకి నగర్‌‌కు చెందిన వికాస్‌ (24) ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. అతడి భార్య శాలిని వివరాలిలా.. కుటుంబంతో కలిసి జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం గోల్డెన్ బీచ్‌ వద్దకు వెళ్లాం. వికాస్ సముద్రతీరంలో అలలతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు మృతదేహం లభ్యంకాలేదని ఆమె వాపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.