News August 24, 2025
HYD: ఐరన్ పైపు తలపై పడి యువకుడి మృతి

HYD సూరారం PS పరిధిలో 4వ అంతస్తు నుంచి ఐరన్ పైపు తలపై పడి అరవింద్ అనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు తెలిపారు. అరవింద్ బిల్డింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ మల్లారెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవన పనులు పర్యవేస్తుండగా ఐరన్ పైప్ ఒక్కసారిగా పడిందన్నారు. తీవ్రగాయాలైన అతడిని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడని చెప్పారు. ఈరోజు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News August 24, 2025
HYD: యువత చూడాల్సిన సినిమా.. పేపర్ లీక్: MLA

పేపర్ లీకుల వల్ల విద్యార్థి, నిరుద్యోగులకు జరిగే నష్టాలు, నాణ్యత లేని విద్య వల్ల యువత ఎదుర్కొనే ఇబ్బందులను యూనివర్సిటీ పేపర్ లీకు సినిమాలో డైరెక్టర్ నారాయణమూర్తి అద్భుతంగా చూపించారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. HYDలో సినిమాపై మీడియాతో మాట్లాడిన ఆయన యువత అందరూ చూడాల్సిన సినిమా అని కొనియాడారు.
News August 24, 2025
HYD: కష్టాలతో కునుకు రాక.. ఇంటికెళ్లలేక..!

సముద్రాలైనా ఈదొచ్చుకానీ కుటుంబ కష్టాల కడలిని ఈదలేం అనే పెద్దల మాటకు ఈయన పరిస్థితి నిలువుటద్దం. ఉప్పల్‌లో ఫుట్‌పాత్‌పై పడుకున్న ఓ వ్యక్తిని కదిలిస్తే..‘రాత్రి నిద్ర పట్టడం లేదు. సుక్కేసి పడుకుందామని ఇంటికెళ్తే కుటుంబ కష్టాలు గుర్తొచ్చి బాధైతుంది’ అంటూ రాత్రికి అక్కడే కునుకు తీస్తున్నట్లు తెలిపారు. మధ్యతరగతి కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంత కష్టమో ఆ వ్యక్తి చెబుతుంటే పలువురు తదేకంగా విన్నారు.
News August 24, 2025
ఒడిశా గోల్డెన్ బీచ్‌లో HYD యువకుడి గల్లంతు

ఒడిశాలోని పూరి సముద్రంలో లంగర్‌హౌస్‌లోని జానకి నగర్‌కు చెందిన వికాస్ (24) ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. అతడి భార్య శాలిని వివరాలిలా.. కుటుంబంతో కలిసి జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం గోల్డెన్ బీచ్ వద్దకు వెళ్లాం. వికాస్ సముద్రతీరంలో అలలతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు మృతదేహం లభ్యంకాలేదని ఆమె వాపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.