News August 24, 2025
కీలక మలుపు తిరిగిన కరేడు రైతు ఉద్యమం

రాష్ట్రంలో సంచలనం రేపిన కరేడు రైతు ఉద్యమం ఆసక్తికర మలుపు తిరిగింది. ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చిన 4,800 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కరేడు, ఉలవపాడు, కందుకూరు తదితర ప్రాంతాలలోని 10 దేవాలయాలకు చెందిన 104.21 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా నోటిఫికేషన్‌లో చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో హైకోర్టు విచారణ చేపట్టింది.
Similar News
News August 24, 2025
DCSలో ఉద్యోగాల సాధించిన అన్నదమ్ములు

ఉదయగిరిలోని దిలార్ బావి వీధి వీధికి చెందిన అన్నదమ్ములు టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. షేక్ నస్రుల్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ సబ్జెక్టులో 57వ ర్యాంకు సాధించగా, ఆయన సోదరుడు షేక్ సిగ్బతుల్లా పీఈటీ జోనల్-3 జనరల్ విభాగంలో 179 వ ర్యాంకు, బీసీఈలో 1వ ర్యాంకు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నస్రుల్లా ప్రస్తుతం దుత్తలూరు మండలం వెంకటంపేట యూపీ స్కూల్లో SGTగా పనిచేస్తున్నారు.
News August 24, 2025
ఆత్మకూరులో దొంగనోట్ల కలకలం

ఆత్మకూరులోని మున్సిపల్ కూరగాయల మార్కెట్లో శనివారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. రెండు రూ.200 నోట్లను షాపులలో ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయలు కొనుగోలు చేసి వెళ్లారు. ఆ షాపు నిర్వాహకులు నోట్లను మరొకరికి ఇచ్చే క్రమంలో దొంగనోట్లుగా తేలింది. దీంతో వారు కంగుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పలువురు హెచ్చరించారు.
News August 23, 2025
సజావుగా పోలీస్ కానిస్టేబుల్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ : SP

కానిస్టేబుల్ ఉద్యోగానికి జరిగిన వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని SP కృష్ణ కాంత్ సూచించారు.