News August 24, 2025

ఎస్.రాయవరం: మూడు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విజయ్

image

ఎస్.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన సుంకరణం విజయ్ డీఎస్సీలో సత్తా చాటాడు. స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)లో 94.7 మార్కులు, పీజీటీ (మ్యాథ్స్)లో 78.5 మార్కులు, టీజీటీ (మ్యాథ్స్)లో 87.3 మార్కులు సాధించాడు. ఈ మూడు కేటగిరిల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ బృందం జిల్లా ప్రతినిధి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం విజయ్‌ను సత్కరించి అభినందించారు.

Similar News

News August 24, 2025

కామారెడ్డి: మద్యం టెండర్లకు వేళాయే..!

image

కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. 2023లో కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం దాదాపు 2,200 దరఖాస్తులు వచ్చాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.44 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి దరఖాస్తు రుసుమును ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ఇప్పుడు రూ.3 లక్షలకు పెంచారు. ఆశవాహులు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

News August 24, 2025

సెప్టెంబర్ 1 నుండి నూతన పాలసీ: రాహుల్ దేవ్

image

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి వస్తుందని ఏపీ ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కొత్త పాలసీలో 10% బార్లను కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. బార్లకు లైసెన్స్ ఫీజు తగ్గించడంతో పాటు వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు అవకాశం కల్పించారన్నారు. బార్ల పనివేళలు ఉదయం 10గం: నుంచి రాత్రి 12 గం: వరకు ఉంటాయన్నారు.

News August 24, 2025

BREAKING: ఖమ్మం: భార్యను కత్తితో పొడిచిన భర్త

image

భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడికి పాల్పడిన ఘటన మధిర రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర మండలం మాటూరుకు చెందిన సూర్యనారాయణ(30) తన భార్య సాయి నాగలక్ష్మి (26)పై అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నాగలక్ష్మికి గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మధిర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.