News August 24, 2025
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని డీబీసీడీవో రవీందర్ తెలిపారు. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News August 24, 2025
SRCL: తండ్రి చితికి నిప్పుపెట్టిన కుమార్తె..!

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లె గ్రామానికి చెందిన సాసాల రాజు(39) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. కాగా, తన పెద్ద కుమార్తె అశ్విత ఆయన చితికి నిప్పుపెట్టింది. ఈ దృశ్యం కుటుంబ సభ్యులతో పాటు బంధువులను కంటతడి పెట్టించింది. తండ్రికి తలకొరివి పెట్టడానికి కుమారుడు లేకపొవడంతో చిన్న వయస్సులోనే కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు.
News August 24, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా

పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతీసారి నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించడం మాటల్లో చెప్పలేను. అన్ని మంచి విషయాలు ముగియాల్సిందే. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు!’ అని Xలో రాసుకొచ్చారు. 103 టెస్టుల్లో 7,195, 5 ODIల్లో 51రన్స్ చేశారు. టెస్టుల్లో 206* టాప్ స్కోర్. 2023లో AUSతో చివరి టెస్టు ఆడారు.
News August 24, 2025
వై.పాలెం: తెలుగులో టాపర్‌గా మనోహర్

ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లికి పుచ్చనూతల మనోహర్ DSCలో సత్తా చాటాడు. SA తెలుగులో 84.82 మార్కులతో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించాడు. TGTలో 74.4 మార్కులతో 28వ ర్యాంక్ పొందాడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో అతడిని పలువురు అభినందించారు.