News August 24, 2025
కామారెడ్డి: కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలి

పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని జిల్లా న్యాయ సేవా అథారిటీ ఛైర్మన్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో సాధ్యమైన అన్ని కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.
Similar News
News August 24, 2025
WGL: మీనాక్షి పాదయాత్రకు నేతలు కలిసొచ్చేనా?..

ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో చేపట్టే జనహిత పాదయాత్రకు నేతలు కలిసి వస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పాదయాత్రపై శనివారం జిల్లాలో ఇన్‌ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ చేపట్టిన రివ్యూ మీటింగ్‌కు కొందరు నేతలు డుమ్మా కొట్టడం ప్రస్తుత చర్చకు తెరదీస్తుంది. రివ్యూ మీటింగ్‌కే రాని వారు పాదయాత్రకు వస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతుంది.
News August 24, 2025
KNR: ఇక్కడ్నుంచే జనహిత పాదయాత్ర START

KNR(D) గంగాధర మండలం ఉప్పరమల్యాలలోనీ అంబేడ్కర్ చౌరస్తా నుంచే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఆదివారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడకు చేరుకుంటున్నారు.
News August 24, 2025
ఆయిల్ పాం ఫ్యాక్టరీ పనులు పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ పనులను సత్వరమే పూర్తయ్యేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పాం ఫ్యాక్టరీ పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సమీక్షలో పాల్గొన్నారు.