News August 24, 2025
గర్భంతో ఉన్న సమయంలో పారాసిటమాల్ వాడుతున్నారా?

మహిళలు గర్భంతో ఉన్న సమయంలో పారాసిటమాల్ వాడితే పుట్టే బిడ్డలపై ప్రభావం చూపిస్తాయని హర్వర్డ్ పరిశోధకులు తెలిపారు. ఈ పెయిన్ కిల్లర్‌ను అతిగా వాడితే జన్యు పరమైన సమస్యలతో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. ఈ మెడిసిన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని అధ్యయనం సూచించింది. అయితే డాక్టర్ల సూచన లేకుండా ఒక్కసారిగా మెడిసిన్ తీసుకోవడమూ ఆపకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News August 24, 2025
airtel ఇంటర్నెట్ డౌన్.. యూజర్ల ఇబ్బందులు

airtel మొబైల్, బ్రాడ్‌బాండ్ సేవలు ఉదయం 11 గంటల నుంచి నిలిచిపోయాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్స్ చేసుకోవడానికి నెట్‌వర్క్ పని చేస్తున్నా నెట్ వాడేందుకు వీలు కావట్లేదంటున్నారు. చాట్ చేసేందుకూ ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కొందరు మొబైల్ రీస్టార్ట్ చేసి ప్రయత్నిస్తున్నారు. దీనిపై airtel స్పందించాల్సి ఉంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.
News August 24, 2025
DVT అంటే ఏంటో తెలుసా?

Deep Vein Thrombosis (<<17502186>>DVT<<>>) బారిన పడితే రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. ఇది సాధారణంగా కాళ్లలోని లోతైన సిరల్లో ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల వరకు చేరుకుంటే Pulmonary Embolismకు దారి తీస్తుంది. దీంతో ఊపిరితిత్తులకు రక్తప్రవాహం ఆగి, ఆక్సిజన్ తగ్గుతుంది. ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. హార్మోనల్ పిల్స్, ఎక్కువ సేపు కూర్చోవడం, సర్జరీ తర్వాత యాక్టివ్‌గా ఉండకపోతే DVT రిస్క్ పెరుగుతుందని డాక్టర్లు తెలిపారు.
News August 24, 2025
టెర్రర్ హబ్స్ కోసం JeM ఫండ్ రైజింగ్?

పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ₹391Cr సేకరణే లక్ష్యంగా ఫండ్ రైజింగ్ డ్రైవ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యుల డిజిటల్ వ్యాలెట్స్‌లోకి ఈ నిధులు జమ అవుతున్నట్లు సమాచారం. వీటితో 313 టెర్రర్ హబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు పలు శిక్షణా శిబిరాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే.