News August 24, 2025
స్త్రీ శక్తి.. మహిళలకు రూ.41.22 కోట్లు మిగులు: టీడీపీ

AP: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకంతో వారం రోజుల్లోనే మహిళలకు రూ.41.22 కోట్లు మిగిలాయని టీడీపీ ట్వీట్ చేసింది. ఏడు రోజుల్లో 1.04 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని వెల్లడించింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే స్త్రీ, పురుష నిష్పత్తి 40:60 ఉంటే ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొంది. కొత్త పథకం అమల్లోకి వచ్చాక పురుష ప్రయాణికులు తగ్గి మహిళలు పెరిగారని తెలిపింది.
Similar News
News August 24, 2025
సీఎం రేవంత్‌కు KTR సవాల్

TG: CM రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్ విసిరారు. ‘పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. 20 నెలల పాలన చూపించి ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము CMకు ఉందా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన MLAలకు భయం పట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అతలాకుతలం చేశారు. దుర్గంచెరువు FTLలో ఉన్న రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?’ అని ప్రశ్నించారు.
News August 24, 2025
ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా?: KTR

TG: కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి BRS కేడర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘ఎవరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ పార్టీ మారారు? ఈ 20 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు? ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా? ఉప ఎన్నికలో గెలిచే దమ్ము ఉందా?’ అని ప్రశ్నించారు.
News August 24, 2025
ట్యాక్స్ పేయర్స్ అత్యధికంగా ఉన్న టాప్-10 రాష్ట్రాలివే!

ఇన్‌కమ్ ట్యాక్స్ డేటా (FY 2024-25) ప్రకారం దేశంలో అత్యధిక శాతం పన్ను చెల్లింపుదారులున్న (వార్షిక ఆదాయం ₹12L-₹50L) రాష్ట్రాల్లో కర్ణాటక (20.6%) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా TG(19.8), ఝార్ఖండ్(19.5), TN(18.8), ఢిల్లీ (17.6), పుదుచ్చేరి(17.4), ఒడిశా(16.8), MH(16.2), AP(15.9), ఉత్తరాఖండ్(14.2) ఉన్నాయి. కాగా రిచ్ స్టేట్‌గా పేరొందిన గుజరాత్(7%) ఈ లిస్టులో Top-10లో లేకపోవడం గమనార్హం.