News August 24, 2025
DSCలో 3 ఉద్యోగాలు సాధించిన రేవతి

ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లెకు చెందిన వీరప్ప-లింగమ్మ కుమార్తె రేవతి డీఎస్సీలో 3 ఉద్యోగాలు సాధించింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రేవతి 9వ ర్యాంక్‌తో స్కూల్ అసిస్టెంట్, 6వ ర్యాంక్‌తో PGT, TGT పోస్టులకు అర్హత సాధించింది. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని రేవతి అన్నారు.
Similar News
News August 24, 2025
PHOTO: బుట్టలెన్ని అల్లినా బువ్వ కరువాయే

కొన్ని వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆకలి తీరని పరిస్థితి, దానికి ఉదాహరణే పై చిత్రం. పాచిపెంటలో బుట్టలు అల్లుకుని 10 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అడవి నుంచి వెదురు కలప తెచ్చి బుట్టలతో గృహలంకరణ వస్తువులు అల్లి వాటిని స్థానికంగా విక్రయించడంతో పాటు ఒడిశాకి ఎగుమతి చేస్తుంటారు. ప్లాస్టిక్ బుట్టలు వాడకంతో పాటు మద్దతు ధర లేక పూట గడవడం కష్టమవుతోందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
News August 24, 2025
సీఎం అన్న ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: KTR

నాయకులు మోసం చేసినా కార్యకర్తలు గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అరాచకాలతోనే HYDలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందన్నారు. తెలంగాణకు గుండెకాయగా కేసీఆర్ HYDను మార్చారని, దుర్గంచెరువు FTLలో సీఎం అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు.
News August 24, 2025
హైదరాబాద్ మెట్రోపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మెట్రో లైన్ వేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లులేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం మరో కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోందన్నారు. ఫేజ్-1లోని ఫలక్‌నుమా-అఫ్జల్ గంజ్ రూట్ ఇంకాపూర్తి కాలేదని.. ఈ పనులు పూర్తి అయిన తరువాతే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు.