News August 24, 2025
MDK: మద్యం టెండర్లు.. వస్తే ఆ కిక్కే వేరు!

ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారుల్లో కదలిక మొదలైంది. ప్రస్తుతం మద్యం షాపులు నడుపుతున్న యజమానులు, గతంలో టెండర్ వేసి షాపులు దొరకని వారు ఇప్పటి నుంచే గ్రూపులు, సిండికేట్లుగా ఏర్పడి టెండర్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. SDPT-93, MDK-49, SRD-101 కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 243 వైన్ షాపులు ఉన్నాయి. మద్యం పాలసీపై మీ కామెంట్.
Similar News
News August 24, 2025
HYD: టాప్- 10 కస్టమర్లను గుర్తించిన వాటర్ బోర్డు

నగరంలో అత్యధికంగా జలమండలి నీటి ట్యాంకర్లను బుక్ చేసిన మొదటి 10 మంది వినియోగదారులను గుర్తించారు. అసలు అన్ని నీటి ట్యాంకర్లు వారు ఎందుకు బుక్ చేసుకుంటున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. గతేడాది అత్యధికంగా 674 వాటర్ ట్యాంకర్లను బుక్ చేసిన సాహితీ ఎంకే రెసిడెన్సీని(ప్రగతినగర్) అధికారులు సందర్శించారు. వారికి ఎండీ అశోక్ రెడ్డి తగు సూచనలు ఇచ్చారు. భూగర్భజలాలు పెంపొందించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
News August 24, 2025
యూరియా, ఎరువులు పక్కదారి పట్టొద్దు: CBN

AP: ఎరువుల ధరలు పెంచి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిలెన్స్ ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. యూరియా, ఎరువులు పక్కదారి పట్టకుండా స్టాక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
News August 24, 2025
ఖైరతాబాద్ మహాగణపతికి స్వాగతం చెప్పేందుకు సిద్ధం

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఘన స్వాగతం చెప్పేందుకు నగర భక్తులు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం 69 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సోమవారం నేత్రోనిలం(కంటిపాప అమర్చడం) అనంతరం ఏకదంతుడికి స్వాగత కార్యక్రమలు ప్రారంభమవుతాయి. సాయంత్రం గణపతి ఆగమన్ నిర్వహించేందుకు ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. 11 రోజుల పాటు మహాగణపతికి నగరవాసులను కనువిందు చేయనున్నాడు.