News August 24, 2025

సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

image

సెప్టెంబర్‌లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. 5న క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, అదే రోజున మురుగదాస్-శివకార్తికేయన్ ‘మదరాసి’, 12న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ కానున్నాయి. తేజా సజ్జ ‘మిరాయ్’ 12న లేదా 19న విడుదలవుతుందని సమాచారం. 25న పవన్ కళ్యాణ్ ‘OG’ రాబోతోంది. రవితేజ ‘మాస్ జాతర’ నెలాఖరులో లేదా OCTలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

Similar News

News August 24, 2025

మూడు రోజులు భారీ వర్షాలు!

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-ప.బెంగాల్‌కు ఆనుకొని రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని తెలిపింది.

News August 24, 2025

BCలకు రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ కసరత్తు

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై మంత్రుల కమిటీ ప్ర‌జాభ‌వ‌న్‌లో స‌మావేశ‌మైంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో BCల‌కు రిజర్వేషన్ కల్పించేందుకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా సలహా ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయం కోరింది. అలాగే రేపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం కూడా తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.

News August 24, 2025

అప్పుడు ఊరికి ఓ గణపతి.. నేడు వీధికొకటి!

image

ఇరవై ఏళ్ల కిందట వినాయక‌ చవితికి ముందు 3రోజులు, ఆ తర్వాత నిమజ్జనం దాకా గ్రామాల్లో సందడి మామూలుగా ఉండేది కాదు. చందాలు సేకరించి ఊరంతటికీ కలిపి ఓ విగ్రహాన్ని సెలక్ట్ చేయడం, మండపాల నిర్మాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు అని ప్లాన్ చేసేవాళ్లు. కానీ ఆ తర్వాత వీధికొక విగ్రహం ఏర్పాటు చేస్తుండటం వల్ల ఊరంతా కలిసి సంబరాలు చేసుకొనే కల్చర్ మాయమవుతోందని ముఖ్యంగా 90’s కిడ్స్ ఫీలవుతున్నారు. మీ COMMENT.