News August 24, 2025

కృష్ణా: వర్షాలకు రోడ్లు ధ్వంసం.. నష్టం ఎంతంటే.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. R&B అధికారుల అంచనాల మేరకు.. మొత్తం 333.32 కి.మీ మేర రోడ్లు పాడయ్యాయి. 14 రోడ్లు పూర్తిగా కొట్టుకుపోగా, ఒక రోడ్డు బాగా దెబ్బతింది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ. 33.09 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ. 251.38 కోట్లు. ఈ నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.

Similar News

News August 24, 2025

కర్నూలు: ఒకే ఊరిలో 21 మందికి టీచర్ ఉద్యోగాలు

image

దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన 21 మంది డీఎస్పీ మెరిట్ లిస్టులో అర్హత సాధించారు. వీరిలో 17 మంది ఎస్జీటీ పోస్టులు, ఒకరు పీఈటీ, మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని వారు పేర్కొన్నారు.

News August 24, 2025

రైలులో తరలిస్తున్న మాదకద్రవ్యాలు స్వాధీనం

image

రైలులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఈగల్ సెల్ బాపట్ల టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ఈగల్ సెల్, రైల్వే పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు.

News August 24, 2025

సిరిసిల్ల: సోషల్ మీడియాపై పోలీసుల ప్రత్యేక నిఘా

image

సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని, వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజానిజాలు తెలుసుకోకుండా ఎలాంటి మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టిందని ఆయన స్పష్టం చేశారు.