News August 24, 2025

రేపు శ్రీవారి టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆగస్టు 25న ఉ.10 గంటలకు విడుదల కానున్నాయి. రేపు మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. నిన్న వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను TTD విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు దళారులను నమ్మవద్దని, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Similar News

News August 24, 2025

ఈ యుగంలో ఫిట్టెస్ట్ క్రికెటర్ అతడే: సెహ్వాగ్

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘వరల్డ్ క్రికెట్‌లో ఫిట్‌నెస్ ట్రెండ్‌ను స్టార్ట్ చేసిన విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్. భారత క్రికెట్లో అతడు ఫిట్‌నెస్ కల్చర్ తీసుకొచ్చారు. ఈ యుగంలో అతడే ఫిట్టెస్ట్ క్రికెటర్. విరాట్ కారణంగా ప్రతి ఒక్క యంగ్ క్రికెటర్ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఓ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయమేంటి?

News August 24, 2025

మా బాలయ్యకు శుభాకాంక్షలు: చంద్రబాబు

image

బాలయ్యకు <<17504424>>వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌<<>>లో చోటు దక్కడంపై CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘హీరోగా బాలకృష్ణ జర్నీ ఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం ఆయన కృషికి నిదర్శనం’ అని ట్వీట్ చేశారు. నారా లోకేశ్, బ్రాహ్మణి, నారా రోహిత్ సహా పలువురు హీరోలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ SMలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

News August 24, 2025

బీసీ బిల్లుపై అమిత్‌షాను కలిసిన స్పీకర్

image

TG: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సదస్సు సందర్భంగా ఆయనను కలిసి బిల్లు ప్రస్తావన తెచ్చారు. ‘అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దీని గురించి సీఎం రేవంత్ మిమ్మల్ని ప్రత్యేకంగా కలిశారు’ అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని అమిత్‌షా బదులిచ్చారు.