News August 24, 2025
ఖమ్మంలో SEP 13న జాతీయ లోక్ అదాలత్

ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి ఉమాదేవి తెలిపారు. క్రిమినల్, సివిల్ ఇతర కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జరిగే లోక్ అదాలత్‌లో ప్రజలు కేసులను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు.
Similar News
News August 25, 2025
ఖమ్మం: ఈ నెల 30 చివరి తేదీ..!

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 30 వరకు గడువు ఉందని ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ గుగులోతు వీరన్న తెలిపారు. ఆదివారం ఎస్ఆర్అండ్‌బీజీఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ ఫీజులతో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
News August 24, 2025
ఖమ్మం: ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి బాలుడు మృతి

కూసుమంచి మండలం కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో తండ్రి రాంబాబు ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా దానిపై కూర్చున్న ఆరేళ్ల బాలుడు భువనేశ్వర్ ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
News August 24, 2025
చరిత్ర కలిగిన నేలకొండపల్లికి పుర హోదా దక్కేనా?

ఖమ్మం జిల్లాలో ఘన చరిత్ర కలిగిన నేలకొండపల్లి మండల కేంద్రం నేటికీ మున్సిపాలిటీకి అవకాశం ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీగానే కొనసాగుతుంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే కేంద్ర నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని మహనీయులు చరిత్ర కలిగిన నేలకొండపల్లి స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. మున్సిపాలిటీ చేయాలన్న ఆలోచన పాలకుల మనసులో ఉన్నా ఆచరణలో ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.