News August 24, 2025
అదానీ సంస్థకు 1200 ఎకరాలు

AP: కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని ఆ సంస్థకు 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐదేళ్లకోసారి 10% లీజు ధర పెంచాలని నిర్ణయించింది. అటు గుంటూరు నడింపాలెంలో జాతీయ యోగా, నేచురోపతి పరిశోధనా సంస్థ ఏర్పాటుకు 12.96 ఎకరాలను ప్రభుత్వం కేంద్రానికి ఉచితంగా కేటాయించింది.
Similar News
News August 24, 2025
రేపట్నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: నాదెండ్ల

AP: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘1.46 కోట్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ATM కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇది CM చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం. నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
News August 24, 2025
సీఎం సహాయనిధికి చిరంజీవి రూ.కోటి విరాళం

AP: సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి విరాళం అందించారు. హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబును ఆదివారం కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. సహాయం అందించిన చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ గతంలోనూ వరద సాయం కింద రూ.కోటి అందించారని గుర్తుచేశారు.
News August 24, 2025
AP న్యూస్ రౌండప్

*తిరుపతి తారకరామా స్టేడియంలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడలు-2025
*అక్టోబర్ 2నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ తొలగిస్తాం: నారాయణ
*నిడదవోలులో 59 మందికి రూ.29.72 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేశ్
*YCP పునాదులను బలపరచడంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలి: సజ్జల
*శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి 3,80,380 క్యూసెక్కుల నీటి విడుదల