News August 24, 2025

విద్యార్థుల ప్రతిభకు మురిసిపోయిన ఖమ్మం కలెక్టర్

image

ప్రతి నెల నాలుగో శనివారం నిర్వహించే బ్యాగ్‌లెస్ డే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. విద్యార్థులు కాగితపు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా, కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, పతంగులు, పోస్టర్లు, పజిల్స్, పేపర్ ఆకృతులను పరిశీలించి, నృత్యం, గానం,ప్రసంగాలు,సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించారు.

Similar News

News August 24, 2025

ఖమ్మం: ట్రాక్టర్‌ రోటవేటర్‌ కిందపడి బాలుడు మృతి

image

కూసుమంచి మండలం కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో తండ్రి రాంబాబు ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా దానిపై కూర్చున్న ఆరేళ్ల బాలుడు భువనేశ్వర్‌ ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

News August 24, 2025

చరిత్ర కలిగిన నేలకొండపల్లికి పుర హోదా దక్కేనా?

image

ఖమ్మం జిల్లాలో ఘన చరిత్ర కలిగిన నేలకొండపల్లి మండల కేంద్రం నేటికీ మున్సిపాలిటీకి అవకాశం ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీగానే కొనసాగుతుంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే కేంద్ర నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని మహనీయులు చరిత్ర కలిగిన నేలకొండపల్లి స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. మున్సిపాలిటీ చేయాలన్న ఆలోచన పాలకుల మనసులో ఉన్నా ఆచరణలో ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.

News August 24, 2025

ఖమ్మం: తగ్గుతున్న పాలేరు జలాశయం నీటి మట్టం

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం నీటి మట్టం గణనీయంగా తగ్గింది. నిన్నటి వరకు వరదల కారణంగా పరవళ్లు తొక్కగా, వర్షాలు తగ్గడంతో పాటు సాగర్ డ్యాం నుంచి నీటి రాక తక్కువగా ఉంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వకు 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి ప్రస్తుతం 19.5 అడుగులకు తగ్గింది.