News August 24, 2025

నందిగామలో భారీ కొండచిలువ

image

నందిగామ శివారు అనాసాగరంలో రైతులకు భారీ కొండచిలువ కనిపించింది. ట్రాక్టర్ దమ్ము చేస్తుండగా కొండచిలువ కనిపించడంతో రైతు ఆందోళన చెంది దానిని హతమార్చారు. మున్నేరుకు భారీగా వరదలు రావడంతో తరచూ పాములు కొట్టుకు వస్తున్నాయని తెలిపారు. పాము కాట్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

Similar News

News August 24, 2025

ఈ యుగంలో ఫిట్టెస్ట్ క్రికెటర్ అతడే: సెహ్వాగ్

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘వరల్డ్ క్రికెట్‌లో ఫిట్‌నెస్ ట్రెండ్‌ను స్టార్ట్ చేసిన విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్. భారత క్రికెట్లో అతడు ఫిట్‌నెస్ కల్చర్ తీసుకొచ్చారు. ఈ యుగంలో అతడే ఫిట్టెస్ట్ క్రికెటర్. విరాట్ కారణంగా ప్రతి ఒక్క యంగ్ క్రికెటర్ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఓ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయమేంటి?

News August 24, 2025

అనంత: CM ప్రోగ్రాం ఏర్పాటు స్థల పరిశీలన

image

సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సెప్టెంబర్ 3న రానున్నారు. ఈ నేపథ్యంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు పనులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించుకున్నారు.

News August 24, 2025

అలంపూర్‌లో మెకానిక్ ఆత్మహత్య

image

ఓ సైకిల్ మెకానిక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అలంపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్బర్‌పేట కాలనీకి చెందిన ఆంజనేయులు(36) గతేడాది నుంచి డయాలసిస్‌తో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం మృతుడి తండ్రి మునెప్ప ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదైంది.