News August 24, 2025

NLG: డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

NLG పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథ స్వామి తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అర్హత కలిగి మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్షియల్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈనెల 28 లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.

Similar News

News August 24, 2025

NLG: వందరోజుల ప్రణాళిక ఏది..?!

image

జిల్లాలోని మున్సిపాలిటీల్లో జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభించిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం నామమాత్రంగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. బ్యానర్ ప్రదర్శిస్తూ ఇంటింటి చెత్త సేకరణ గురించి ఊదరగొడుతూ ఫొటోలు దిగి గంట వ్యవధిలో కార్యక్రమం ముగించి మమ అనిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి ప్రణాళికా రూపొందించకుండా మొదలు పెట్టడంతో అంతా గందరగోళంగా మారిందని పలువురు అంటున్నారు.

News August 23, 2025

మహిళా పోలీసులకు ఆత్మరక్షణలో శిక్షణ: ఎస్పీ

image

పోలీసు శాఖలో పురుషులతో సమానంగా విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించేందుకు ‘SHE leads-NALGONDA believes’ కార్యక్రమం ద్వారా వారం రోజుల పాటు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈ శిక్షణలో నేర పరిశోధన, బ్లూ క్లోట్స్, రాత్రి గస్తీ, బందోబస్తు విధుల్లో వారికి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడే మెలకువలు నేర్పించామని తెలిపారు.

News August 23, 2025

వారం రోజుల్లో సమర్పించాలి: కలెక్టర్ ఇలా

image

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖ దిగువనున్న ప్రాథమిక ఆదాయం కలిగిన 18 – 59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ పెద్ద సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన సమయంలో ఒకేసారి రూ.20 వేలు నగదు సహాయాన్ని కుటుంబానికి అందిస్తామన్నారు.