News August 24, 2025
విశాఖలో ఉదయాన్నే యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

విశాఖలో ఆదివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గంట్యాడ నుంచి గంగవరానికి వెళ్లే దారిలో కొంగపాలెం జంక్షన్ వద్ద నడిచి వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న న్యూ పోర్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 24, 2025
కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు హాజరవుతారు. అర్జీలు, పాత స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం అయిన వెంటనే మెసేజ్ వస్తుందని చెప్పారు. కాల్ సెంటర్ 1100 లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కోరారు.
News August 24, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌లో గంజాయి స్మగ్లర్ల అరెస్టు

విశాఖ రైల్వే స్టేషన్‌లో జి.ఆర్.పీ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. ధనంజయనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం జి.ఆర్.పీ-ఆర్‌పీఎఫ్ సంయుక్త తనిఖీల్లో, కర్ణాటకకు చెందిన రసూల్ (27), షాదీక్ హుస్సేన్ వద్ద నుంచి రూ.50,000 విలువైన 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి ముఠాలపై ప్రత్యేక నిఘా బృందాలతో విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం స్టేషన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
News August 24, 2025
జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లపై సమీక్ష

జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు హాజరుకానుండటంతో రవాణా, వసతి, పార్కింగ్, భద్రత, తదితర సదుపాయాలపై అధికారులు, నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కమిషనర్ పాల్గొన్నారు