News April 2, 2024

మేడారంలో భక్తులకు ఇక్కట్లు

image

జాతర సమయంలో వనదేవతల దర్శనానికి రాని భక్తులు ప్రస్తుతం మేడారానికి తరలివస్తున్నారు. అయితే జాతరకు వస్తున్న భక్తులపై ఎండ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దర్శించుకునే క్రమంలో గద్దెల ప్రాంగణంలో నీడ లేకపోవడం, కింద పూర్తిగా నాపరాళ్లు ఉండటంతో.. అవస్థలు తప్పట్లేదు. దీంతో గోవిందరాజు గద్దెవైపు చెట్ల నీడ పడుతుండటంతో దర్శనం తర్వాత అటుగా వెళ్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చాలని భక్తులు కోరుతున్నారు.

Similar News

News March 18, 2026

వరంగల్: రెండవ రోజు 99.9 శాతం విద్యార్థులు హాజరు

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రెండవరోజు వరంగల్ జిల్లాలో మొత్తం 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,482 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,473 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజయ్యారు. మొత్తంగా హిందీ పరీక్షకు 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగలేదని డీఈవో రంగయ్య తెలిపారు.

News March 16, 2026

స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్‌

image

వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.

News March 16, 2026

WGL: సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

వరంగల్‌-కాజీపేట స్టేషన్ల మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఈనెల 15నాటి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్-సికింద్రాబాద్ బస్సు టికెట్, సప్తగిరి థియేటర్ సినిమా టికెట్ లభించాయి. ఇతర గుర్తింపు ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.