News August 24, 2025
VZM: తెంగాణలో స్టేట్ టాపర్.. ఏపీలో 5 ఉద్యోగాలు

DSC ఫలితాల్లో విజయనగరానికి చెందిన కే.వి.ఎన్ శ్రీరాం 5 ఉద్యోగాలు సాధించాడు. SA గణితంలో 7వ ర్యాంక్, ఫిజిక్స్ 10th, జోన్ స్థాయి పోస్టులో PGT మ్యాథ్స్ 5th, TGT మ్యాథ్స్ 18th, జనరల్ సైన్స్‌లో 7వ ర్యాంక్ వచ్చింది. కాగా తెలంగాణ DSC పోటీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ మాథ్స్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంక్ సాధించి ఖమ్మం జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
Similar News
News August 24, 2025
డోన్స్ సహాయంతో 90 కేసులు నమోదు: SP

జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశామని చెప్పారు. వాటిలో డ్రోన్స్ సహాయంతో 90 కేసులు నమోదు చేశామన్నారు.
News August 24, 2025
రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: SP

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీస నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.
News August 23, 2025
డీఎస్సీ ఫలితాలు.. ఆరు ఉద్యోగాలు సాధించిన ప్రసాద్

వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన గుంట ప్రసాద్ శుక్రవారం వెలువడిన DSC ఫలితాలలో ఎస్‌సిబి కేటగిరిలో ఆరు ఉద్యోగాలు సాధించారు. SA ఫిజిక్స్, SA మ్యాథ్స్, PGT ఫిజికల్ సైన్స్, TGT మ్యాథ్స్ జోన్1, TGT ఫిజిక్స్ జోన్1, TGT సైన్స్ జోన్1లలో ఉత్తీర్ణత సాధించారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తనను చదివించారని ప్రసాద్ తెలిపారు. ఇష్టమైన ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరుతానన్నారు.