News August 24, 2025
కామారెడ్డి: మద్యం టెండర్లకు వేళాయే..!

కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. 2023లో కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం దాదాపు 2,200 దరఖాస్తులు వచ్చాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.44 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి దరఖాస్తు రుసుమును ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ఇప్పుడు రూ.3 లక్షలకు పెంచారు. ఆశవాహులు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
Similar News
News August 24, 2025
ఎన్టీఆర్ జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ సెప్టెంబర్ 7న దుర్గమ్మ గుడి మూసివేత
☞ అనిగండ్లపాడులో క్షుద్ర పూజలు కలకలం
☞ వత్సవాయిలో మహిళ సూసైడ్
☞ నందిగామలో భారీ కొండచిలువ
☞ చందర్లపాడులో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
☞ నిడమానూరు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
☞ కంచికచర్లలో చేతికొచ్చిన మినప పంట.. తగ్గిన ధరలు
News August 24, 2025
రాత్రి కొబ్బరినూనె తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?

రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ‘రాత్రి ఒక టీస్పూన్ కొబ్బరినూనె తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఇలా చేస్తే శరీరంలో పైత్యరసం సక్రమంగా ఉత్పత్తి జరిగి మలబద్ధకం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి గాఢ నిద్ర పడుతుంది. లివర్, శరీరంలో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.
News August 24, 2025
NGKLలో దారుణం.. అడవిలో భార్యను కాల్చి చంపిన భర్త

భార్యను కాల్చి చంపిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. లింగాల(M) కొత్తరాయవరం వాసి శ్రీశైలం MBNRకు చెందిన శ్రావణిని ప్రేమించి 2014లో పెళ్లిచేసుకున్నాడు. ఇద్దరి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు రావడంతో శ్రావణి ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో సోమశిలకు వెళ్దామని మాయమాటలు చెప్పి ఈనెల 21న పెద్దకొత్తపల్లిలోని సాతాపూర్ మారేడుమాన్‌దిన్నే అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి కాల్చి చంపాడు.