News April 2, 2024
ఎడమ కాలువకు నీటి విడుదల.. తాగునీటి అవసరాలకే!

సాగర్ ఎడమ కాల్వకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. వెయ్యి క్యూసెక్కులతో మొదలయ్యి 2,500 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. నీటిని వృథా చేయకుండా కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని అధికారులు కోరారు. అయితే సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 513.40 అడుగులుగా ఉంది.
Similar News
News March 13, 2026
NLG: అక్రమ గ్యాస్ వినియోగంపై ఉక్కుపాదం

జిల్లాలో డొమెస్టిక్(వంట గ్యాస్) సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం నల్గొండతో పాటు మల్లేపల్లి గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు.
News March 13, 2026
చెరువుగట్టు రామలింగేశ్వరుడికి భారీ ఆదాయం

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన వివిధ వేలం పాటలు గుడికి రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ.50,22,887 ఆదాయం సమకూరినట్లు EO సల్వాది మోహన్ బాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేలం పాటల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది రూ.13 లక్షలకుపైగా అదనపు ఆదాయం లభించింది.
News March 13, 2026
NLG: జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరతలేదని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన తన ఛాంబర్లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో LPG సరఫరాపై సమావేశం నిర్వహించారు. HPCL, IOCL, BPCL LPG ఆయిల్ కంపెనీలు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయన్నారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లించిన 16మందిపై కేసులు పెట్టామన్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రమే స్వల్ప ఇబ్బందులు ఉన్నాయన్నారు.


