News August 24, 2025

సంగారెడ్డి: ఎస్జీటీ పదోన్నతుల జాబితా విడుదల

image

ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందే ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. 190 మందికి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి వచ్చినట్లు పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు సోమవారం వెబ్ ఆప్షన్ ద్వారా పాఠశాలను ఎంచుకోవాలని చెప్పారు. కేటాయించిన పాఠశాలలో 26న విధుల్లో చేరాలని సూచించారు.

Similar News

News August 24, 2025

SKLM: రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News August 24, 2025

కొరిశపాడులో దొంగతనం.. రూ.1.85కోట్ల ల్యాప్‌ట్యాప్‌ల చోరీ

image

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ కంటైనర్ హైదరాబాదు నుంచి చెన్నై వెళ్తోంది. ఈ క్రమంలో కంటైనర్ నుంచి సుమారు 250 ల్యాప్‌టాప్‌లను గుర్తు తెలియని దుండగులు శనివారం అపహరించారు. వీటి విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని చీరాల డీఎస్పీ మొయిన్ వివరాలు వెల్లడించారు.

News August 24, 2025

103 శాటిలైట్స్, చంద్రయాన్-8.. ఇస్రో ప్లాన్ ఇదే!

image

ఇస్రో ఫ్యూచర్ ప్లాన్‌పై స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ‘2025-2040 వరకు భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ 15 ఏళ్లలో సెక్యూరిటీ, సర్వైలెన్స్, ఎర్త్ అబ్జర్వేషన్, ల్యాండ్, ఓషన్ అప్లికేషన్స్ తదితర 103 శాటిలైట్స్ లాంచ్ చేయనున్నాం. చంద్రయాన్-4,5,6,7,8 మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం. బెస్ట్ స్పేస్ ఫెయిరింగ్ నేషన్‌గా భారత్ ఎదుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.