News August 24, 2025

ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లకు అవకాశం

image

TG: డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్ ఫేజ్-2 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24, 25న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి, అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే మార్చుకోవచ్చు. మరో కాలేజీలో అలాంటి అవకాశం ఉండదు.

Similar News

News August 24, 2025

భారత్ నిబంధనలకు లోబడే STARLINK సేవలు

image

ఎలాన్ మస్క్ STARLINKకు భారత్‌లో ఇంటర్నెట్ సేవలందించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యునికేషన్స్ నుంచి అనుమతి లభించింది. మన నిబంధనలకు లోబడే సేవలు అందించనున్నారు. అంటే భారతీయ వినియోగదారుల డేటాను విదేశాల్లో కాపీ, డీక్రిప్టింగ్ చేయకూడదు. విదేశాల్లోని సిస్టమ్స్‌లో ఇండియన్స్ ట్రాఫిక్ డీటెయిల్స్ మిర్రరింగ్ కాకూడదు. ఇండియాలో ఎర్త్ స్టేషన్ గేట్‌వేస్ నిర్మించడానికి కూడా సంస్థ అంగీకరించిందని అధికారులు తెలిపారు.

News August 24, 2025

‘రహస్య మీటింగ్’ ప్రచారమే: రాజగోపాల్

image

TG: 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించాననే ప్రచారం అబద్ధమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. CM రేవంత్‌తో అంతర్గత సమస్యలున్నా చీలిక ఆలోచన తనలో లేదన్నారు. విభేదాలున్న ఈ సమయంలో సన్నిహిత ఎమ్మెల్యేలు క్యాజువల్‌గా తనను కలవడంతో భేటీగా పొరబడ్డారని వివరించారు. కాగా CMపై ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మునుగోడు MLA సీక్రెట్ మీట్‌పై మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.

News August 24, 2025

త్వరలో RSS కీలక మీటింగ్.. వీటిపైనే చర్చ!

image

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) వార్షిక సమావేశం SEP 5-7 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగనుంది. RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్‌కు BJP సహా ABVP, భారతీయ మజ్దూర్, కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసీ కళ్యాణ్, సేవా సమితి తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. BJP తదుపరి చీఫ్ ఎన్నికతో పాటు US టారిఫ్స్ ఇతర సమకాలీన కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.