News April 2, 2024

మే 1 వరకు నిషేధాజ్ఞలు కొనసాగింపు: CP

image

ఈనెల 1 నుంచి నెల రోజుల పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాల పరిధిలో ఎలాంటి డ్రోన్ కెమెరాలు, డీజే సౌండ్ సిస్టంలు వినియోగించకూడదని పేర్కొన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటూమన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Similar News

News December 24, 2025

KNR: దక్షిణాది స్థాయి ఈత పోటీలకు స్వరణ్‌, భువన్‌ ఎంపిక

image

హైదరాబాద్‌లో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగే దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కంకణాల స్వరణ్‌, భువన్‌ ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వరణ్‌ బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో రజత పతకం సాధించగా.. వాటర్‌ పోలో జట్టుకు భువన్‌ ఎంపికయ్యారు. వీరిని జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో శ్రీనివాస్‌గౌడ్, కోచ్‌లు అభినందించారు.

News December 24, 2025

కరీంనగర్: ‘ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరగాలి’

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి, సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. కనీసం 80శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చూడాలన్నారు. ఆర్.బి.ఎస్.కె పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. గర్భిణుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News December 24, 2025

కొత్తకొండ వీరభద్రస్వామి జాతర తేదీలు ఇవే

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి ఆలయంలో 2026 సం.నికి సంబంధించిన బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జనవరి 10న వీరభద్ర స్వామి కళ్యాణం, 14న భోగి పండుగ, 15న బండ్ల తిరుగుట(సంక్రాంతి) కార్యక్రమాలు జరుగనున్నాయి. జనవరి 18న అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.