News August 24, 2025
HMS గౌరవ అధ్యక్షురాలిగా కవిత?

TG: MLC కవిత హిందూ మజ్దూర్ సభ గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి(TBGKS)గా ఆమె అందించిన సేవలకు గుర్తుగా HMS అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని సంఘం నాయకులు నిర్ణయించారు. AUG 31న మంచిర్యాల(D) శ్రీరాంపూర్‌లో జరిగే సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇటీవలే TBGKS అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తొలగించి, కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్నారు.
Similar News
News August 25, 2025
DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మార్పు

AP: 16,347 DSC పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారినట్లు మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తొలుత సోమవారం వెరిఫికేషన్ నిర్వహించాలని భావించినా పలు కారణాలతో మంగళ, బుధవారాల్లో చేపట్టనున్నట్లు వివరించారు. ఆన్‌లైన్ అప్లికేషన్లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమంలోనే CV నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 22న మెరిట్ లిస్ట్ రిలీజైన విషయం తెలిసిందే.
News August 24, 2025
భారత్ నిబంధనలకు లోబడే STARLINK సేవలు

ఎలాన్ మస్క్ STARLINKకు భారత్‌లో ఇంటర్నెట్ సేవలందించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యునికేషన్స్ నుంచి అనుమతి లభించింది. మన నిబంధనలకు లోబడే సేవలు అందించనున్నారు. అంటే భారతీయ వినియోగదారుల డేటాను విదేశాల్లో కాపీ, డీక్రిప్టింగ్ చేయకూడదు. విదేశాల్లోని సిస్టమ్స్‌లో ఇండియన్స్ ట్రాఫిక్ డీటెయిల్స్ మిర్రరింగ్ కాకూడదు. ఇండియాలో ఎర్త్ స్టేషన్ గేట్‌వేస్ నిర్మించడానికి కూడా సంస్థ అంగీకరించిందని అధికారులు తెలిపారు.
News August 24, 2025
‘రహస్య మీటింగ్’ ప్రచారమే: రాజగోపాల్

TG: 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించాననే ప్రచారం అబద్ధమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. CM రేవంత్‌తో అంతర్గత సమస్యలున్నా చీలిక ఆలోచన తనలో లేదన్నారు. విభేదాలున్న ఈ సమయంలో సన్నిహిత ఎమ్మెల్యేలు క్యాజువల్‌గా తనను కలవడంతో భేటీగా పొరబడ్డారని వివరించారు. కాగా CMపై ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మునుగోడు MLA సీక్రెట్ మీట్‌పై మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.