News August 24, 2025
HYD: ‘సహస్ర చెల్లి లాంటిది.. తప్పు చేయలేదు: వెంకట్

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్‌కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్‌ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.
Similar News
News August 25, 2025
కిషన్‌రెడ్డి వాస్తవాలను దాస్తున్నారు: తుమ్మల

TG: యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రి తుమ్మల ఖండించారు. ‘11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీకు తెలియదా? దిగుమతులు, దేశీయంగా సరిపడా ఉత్పత్తి లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాస్తున్నారు. కేంద్రం TGకి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. కానీ 5.66 లక్షల మె.టన్నులే సరఫరా చేసింది’ అని స్పష్టం చేశారు.
News August 25, 2025
రేపు కాల్ లెటర్స్ విడుదల: డీఎస్సీ కన్వీనర్

AP: మెగా <<17508409>>డీఎస్సీ<<>> మెరిట్ అభ్యర్థులకు రేపు కాల్ లెటర్స్ అందుతాయని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అధికారులతో పాటు రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగితో కలిపి ముగ్గురు ఒక టీమ్‌గా ఉంటారని పేర్కొన్నారు. కాగా ధ్రువపత్రాల పరిశీలన ఎల్లుండి నుంచి మొదలు కానుంది.
News August 25, 2025
కాప్రా: స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో స్క్రాప్ తగలబడడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.