News April 2, 2024

KKRvsRR మ్యాచ్ తేదీ మార్పు! ఎందుకంటే?

image

ఈనెల 17న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోజు శ్రీరామ నవమి ఉండటంతో మ్యాచ్‌కు కావాల్సిన భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ సంఘానికి అక్కడి పోలీసులు తెలిపారు. మ్యాచ్ తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Similar News

News March 19, 2026

NTR: వివాహేతర సంబంధం.. గొడ్డలితో దాడి

image

ఏ.కొండూరు మండలం పెద్దతండాలో హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. చీమలపాడుకు చెందిన పటాపంచల జమలయ్యపై తండాకు చెందిన లావూరి సీతారాం గొడ్డలితో దాడి చేశాడు. వివాహేతర సంబంధం వివాదమే ఘటనకు కారణమని సమాచారం. తీవ్రంగా గాయపడిన జమలయ్యను అత్యవసర చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి ఎస్సై గంధం మహాలక్ష్మణుడు దర్యాప్తు చేపట్టారు.

News March 19, 2026

ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టుకు గంభీర్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన పేరు, ఫొటోలు, ఐడెంటిటీని ఆయుధాలుగా వాడుకుంటున్నారని, ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. తనపై పోస్టులు చేసిన ఖాతాలు, ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని, రూ.2.5కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

News March 19, 2026

హార్ముజ్ ఒక్కటే కాదు..: కేంద్రం

image

హార్ముజ్‌పై భారత్ డిపెండెన్సీ తగ్గిందని.. 70% క్రూడ్‌ ఇతర ప్రాంతాల నుంచి వస్తోందని కేంద్రం తెలిపింది. LPG సరఫరాను వికేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నామంది. రెగ్యులర్‌గా దిగుమతి చేసుకునే ఖతర్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు పెంచనున్నట్లు తెలిపింది. అవసరమైతే రష్యా నుంచి కూడా LPG కొంటామని పేర్కొంది. మరోవైపు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు టోల్‌ఛార్జ్ విధించే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.