News August 24, 2025
DRDO IADWS ప్రయోగం విజయవంతం

DRDO ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్(IADWS) ప్రయోగం విజయవంతం కావడంపై సంస్థ, సాయుధ బలగాలను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అభినందించారు. ఇందులో బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి(QRSAM), వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(VSHORADS) మిసైల్స్, లేజర్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. దీంతో వాయు రక్షణ పెరగడంతో పాటు శత్రు వైమానిక ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది.
Similar News
News August 25, 2025
కొత్త రేషన్ కార్డులు.. నేటి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ

AP: నేటి నుంచి దశల వారీగా <<17506953>>కొత్త రేషన్<<>> కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రేషన్ పంపిణీలో లబ్ధిదారులకు పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలను అందించేందుకు క్యూఆర్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ఇవ్వనుంది. తొలి విడతలో ఇవాళ్టి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. రెండో విడతలో ఈ నెల 30 నుంచి మరో నాలుగు జిల్లాల్లో, మూడో విడతలో సెప్టెంబర్ 6 నుంచి ఐదు జిల్లాల్లో, 15 నుంచి 8 జిల్లాల్లో ఇవ్వనున్నారు.
News August 25, 2025
‘వినాయక చవితి’ ట్రెండ్ మారింది

గణేశ్ నిమజ్జనం రోజు చూసే వేడుకలు ఇప్పుడు వినాయకుడి ఆగమనం రోజున కనిపిస్తున్నాయి. విగ్రహాలను కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొస్తున్న సమయంలోనూ యువత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజే మ్యూజిక్, ఫైర్ వర్క్స్, రంగులు చల్లుకుంటూ బొజ్జ గణపయ్యకు ఆహ్వానం పలుకుతున్నారు. నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ గ్రామాలకు విస్తరిస్తోంది. ఏమైనప్పటికీ విద్యుత్ వైర్ల కింద నుంచి, రహదారులపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
News August 25, 2025
ఆగస్టు 25: చరిత్రలో ఈ రోజు

1952: తమిళ నటుడు విజయ్ కాంత్ జననం
1953: పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి మరణం
1994: రెజ్లర్ వినేశ్ ఫొగట్ జననం
1999: తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ మరణం
2007: గోకుల్ చాట్, లుంబినీ పార్కులో ముష్కరుల బాంబు దాడి.. 42 మంది మృతి
2012: చంద్రుడిపై కాలు పెట్టిన తొలి మనిషి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం(ఫొటోలో)