News August 24, 2025

NZB: మెడికల్ కాలేజీలో దాడి.. ర్యాగింగ్ కలకలం?

image

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. MBBS నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సీనియర్లు (హౌస్ సర్జన్స్) ర్యాగింగ్‌కు పాల్పడి దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా ర్యాగింగ్, దాడి ఘటనపై ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతున్నామని NZB వన్‌టౌన్ SHO రఘుపతి తెలిపారు.

Similar News

News August 25, 2025

NZB: ప్రజావాణికి 102 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

News August 25, 2025

SRSP UPDATE: తగ్గిన ఇన్ ఫ్లో.. వరద గేట్ల మూసివేత

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గడంతో సోమవారం మధ్యాహ్నం వరద గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 29,907 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోందని, దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ కాలువకు 20 వేలు, కాకతీయ కాల్వకు 3,500, సరస్వతి కాల్వకు 500, లక్ష్మీ కెనాల్‌కు 150, అలీ సాగర్ లిఫ్ట్‌కు 360 క్యూసెక్కుల నీరు వదులుతున్నామన్నారు.

News August 25, 2025

NZB: విగ్రహాలు తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి: CP

image

గణేశ్ మండలి నిర్వహకులు విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ CP సాయి చైతన్య సూచించారు. కొన్ని రోజులుగా 4 విద్యుత్ ప్రమాదాలు జరిగాయని, వాటిలో 9 మంది యువకులు మరణించారని పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాల రవాణా, స్థాపించే మండపాల వద్ద ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు.