News August 24, 2025
airtel ఇంటర్నెట్ డౌన్.. యూజర్ల ఇబ్బందులు

airtel మొబైల్, బ్రాడ్‌బాండ్ సేవలు ఉదయం 11 గంటల నుంచి నిలిచిపోయాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్స్ చేసుకోవడానికి నెట్‌వర్క్ పని చేస్తున్నా నెట్ వాడేందుకు వీలు కావట్లేదంటున్నారు. చాట్ చేసేందుకూ ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కొందరు మొబైల్ రీస్టార్ట్ చేసి ప్రయత్నిస్తున్నారు. దీనిపై airtel స్పందించాల్సి ఉంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.
Similar News
News January 2, 2026
విశాఖ ఏజెన్సీలో లాభాలు అందిస్తున్న స్ట్రాబెర్రీ సాగు

విశాఖ జిల్లా లంబసింగి పరిధిలో స్ట్రాబెర్రీ సాగు జోరందుకుంది. మంచి లాభాలు వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణె నుంచి మొక్కలు తెచ్చి నాటుతుండగా, ఏప్రిల్ చివరి వరకు దిగుబడి ఉంటుంది. ఎకరా సాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇక్కడకు వచ్చే టూరిస్టులకు కాయలు, స్ట్రాబెర్రీ జామ్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్, జూస్ రూపంలో విక్రయిస్తూ పెంపకందారులు మంచి ఆదాయం పొందుతున్నారు.
News January 2, 2026
పేరెంట్స్ వాట్సాప్‌కు ఇంటర్ స్టూడెంట్స్ హాల్‌టికెట్లు

TG: హాల్‌టికెట్లను విద్యార్థుల పేరెంట్స్ వాట్సాప్‌కు పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి ఎగ్జామ్స్ జరగనుండగా 45 రోజుల ముందే వాట్సాప్‌కు లింక్ పంపుతామని, దీంతో వాటిలో తప్పులేమైనా ఉంటే గుర్తించే వీలుంటుందని పేర్కొంది. ఫస్టియర్ స్టూడెంట్స్ తమ SSC రోల్ నంబర్, DOB.. సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్, DOB ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.
News January 2, 2026
లొంగిపోయిన దేవా

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోలతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. దేవాపై రూ.50లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.


