News August 24, 2025
WGL: పాక్స్ డైరెక్టర్ ఇంట్లో యూరియా బస్తాలు లభ్యం

రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో PACS డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 26 యూరియా బస్తాలను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. రాయపర్తి ఏవో వీరభద్రం ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారంతో తనిఖీలు చేయగా బస్తాలు లభించాయి. యాదగిరిపై బీఎన్ఎస్ 6ఏ కింద కేసు నమోదు చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ డైరెక్టర్ ఇంట్లో అక్రమ నిల్వలు కలకలం సృష్టించాయి.
Similar News
News August 25, 2025
నిజామాబాద్: జిల్లాకు రెండు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కళాశాలలు

NZB జిల్లాకు మైనారిటీ గురుకుల విద్యా సంస్థల(టెమ్రిస్) ఆధ్వర్యంలో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ కార్యదర్శి షఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి బాలుర కోసం నాగారంలో, మరొకటి బాలికల కోసం ధర్మపురి హిల్స్‌లోని మదీనా ఈద్గాలో ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా అధికారి బషీర్ తెలిపారు.
News August 25, 2025
దక్షిణాఫ్రికా పేరిటే ఆ రికార్డు

వన్డేల్లో అత్యధిక సార్లు 400+ రన్స్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా(8) పేరిట రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో టీమ్ ఇండియా(7), ఇంగ్లండ్(6), <<17503678>>ఆస్ట్రేలియా<<>>(3), NZ(2), SL(2), జింబాబ్వే(1) ఉన్నాయి. చిత్రమేమిటంటే వెస్టిండీస్, PAK, బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఈ మార్క్ అందుకోలేకపోయాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సిరీస్‌లు(సిరీస్‌లో కనీసం 3 వన్డేలు) గెలిచిన జట్టుగా సౌతాఫ్రికా(9) రికార్డు నెలకొల్పింది.
News August 25, 2025
విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు: ADB DSP

మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ మండలం అంకోలిలో ఆయన ఇరువర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. వాట్సాప్ గ్రూపుల్లో గొడవలకు దారి తీసే పోస్టులు పెట్టవద్దని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.