News August 24, 2025

WGL: మీనాక్షి పాదయాత్రకు నేతలు కలిసొచ్చేనా?..

image

ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో చేపట్టే జనహిత పాదయాత్రకు నేతలు కలిసి వస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పాదయాత్రపై శనివారం జిల్లాలో ఇన్‌ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ చేపట్టిన రివ్యూ మీటింగ్‌కు కొందరు నేతలు డుమ్మా కొట్టడం ప్రస్తుత చర్చకు తెరదీస్తుంది. రివ్యూ మీటింగ్‌కే రాని వారు పాదయాత్రకు వస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతుంది.

Similar News

News August 25, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. వర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంతో పాటు పలు భవనాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి. అటు వర్సిటీ భూముల సర్వే, నియామకాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓయూ కార్యక్రమం అనంతరం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.

News August 25, 2025

ఈ సమయాల్లో నీరు తాగితే?

image

శరీరానికి అత్యవసరమైన వాటిలో నీరు ఒకటి. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగితే ఎన్నో రోగాలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
✒ నిద్ర లేవగానే గోరు వెచ్చని నీరు తాగితే టాక్సిన్స్‌(వ్యర్థాలు)ను బయటకు పంపుతుంది. ✒ భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ✒ స్నానానికి ముందు నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ✒ నిద్రకు ముందు తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది.

News August 25, 2025

నిజామాబాద్: జిల్లాకు రెండు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కళాశాలలు

image

NZB జిల్లాకు మైనారిటీ గురుకుల విద్యా సంస్థల(టెమ్రిస్) ఆధ్వర్యంలో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ కార్యదర్శి షఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి బాలుర కోసం నాగారంలో, మరొకటి బాలికల కోసం ధర్మపురి హిల్స్‌లోని మదీనా ఈద్గాలో ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా అధికారి బషీర్ తెలిపారు.