News August 24, 2025
నరసన్నపేట: ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.
Similar News
News August 25, 2025
రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.
News August 24, 2025
SKLM: ‘వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం’

గార(M) అంపోలులో దంపతుల <<17502057>>ఆత్మహత్య<<>> ఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. పెన్షన్ నిలిచిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో, గార తహశీల్దార్ విచారణలో ఈ విషయం బయటపడిందన్నారు. గ్రామస్థుల వాంగ్మూలం ప్రకారం.. కుటుంబ అంతర్గత ఆస్తి, ఇంటికి సంబంధిత వివాదాలే వారి మృతికి ప్రధాన కారణమని నిర్ధారించారు.
News August 24, 2025
SKLM: రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.