News August 24, 2025
గగన్‌యాన్ మిషన్.. తొలి అడుగు విజయవంతం

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో చేపట్టిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్(IADT-01) విజయవంతమైంది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా క్యాప్సుల్‌ను పారాచూట్ల సాయంతో సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేసింది. ఈ పరీక్షను IAF, DRDO, నేవీ, కోస్ట్ గార్డ్‌తో కలిసి ఇస్రో చేపట్టింది. కాగా ఇండియా మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు గగన్‌యాన్ మిషన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News August 25, 2025
840 కొత్త బార్లకు 30 అప్లికేషన్లే!

AP: నూతన <<17448943>>బార్<<>> విధానానికి స్పందన కరువైంది. మొత్తం 840 బార్లకు నిన్నటి వరకు 30 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లైసెన్స్ దరఖాస్తులకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో ఎక్సైజ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరంటూ నిబంధనలు వ్యాపారుల నుంచి వ్యతిరేకతకు కారణమని సమాచారం. అయితే నిబంధనల్లో మార్పులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు.
News August 25, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరంలో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరిలో భారీ వర్షాలు, ఇతర చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, KMM, ఉమ్మడి ADB, వరంగల్, KNR, నల్గొండ, MBNRలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 25, 2025
ఇవాళ అందుబాటులోకి DSC కాల్ లెటర్లు

AP: DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కాల్‌లెటర్లు నేటి నుంచి అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఈరోజు నుంచే వెరిఫికేషన్ చేపట్టాలని భావించినా, సాంకేతిక ఇబ్బందుల కారణంగా కాల్ లెటర్ల జారీ ఆలస్యంతో వాయిదా వేసింది. మొత్తం 16,347 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితా సిద్ధం చేసి పోస్టింగ్ ఇస్తారు.