News August 24, 2025
నెల్లూరు: 10 కిలోల గంజాయి సీజ్

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తిరుపతి వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఆపగా అందులో రూ.80 వేలు విలువచేసే 10 కేజీల గంజాయిను గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాలోని కోరాపూర్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అమ్మేందుకు వెళుతుండగా మార్గం మధ్యలో వారిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Similar News
News August 25, 2025
నెల్లూరు: మద్యం కోసం కత్తితో బావనే బెదిరించాడు

మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో సొంత బావనే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. జ్యోతి నగర్‌కు చెందిన సాజిద్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తన బావ సంధానిని అడిగాడు. అతను లేవని చెప్పడంతో కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి రూ.1000 తీసుకున్నాడు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News August 25, 2025
నెల్లూరు: జీవిత ఖైదు మృతి

అనారోగ్యంతో జీవిత ఖైదీ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా మైపాడుకు చెందిన షేక్ కాలేషా(64) ఓ వ్యక్తిని హత్య చేసి నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో నెల్లూరు జైలు పోలీసులు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
News August 25, 2025
నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.