News August 24, 2025
రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: SP

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీస నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.
Similar News
News August 25, 2025
ఎమ్మెల్యే కళా వెంకట్రావు సోదరడి మృతి

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నయ్య నీలం నాయుడు (75) అనారోగ్య కారణంగా సోమవారం ఉదయం రేగిడిలో మృతి చెందారు. ఈయన గతంలో రేగిడి గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. స్వస్థలం రేగిడిలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నీలం నాయుడు మృతితో రేగిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News August 25, 2025
రామభద్రపురం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

రామభద్రపురానికి సమీపంలో ఉన్న సిమెంట్ గోడౌన్‌లో పనిచేస్తున్న జన్నివలసకు చెందిన ఎం.శ్రీను (44) ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీను పని చేస్తున్న గోడౌన్‌లో తడి బట్టలను తాడుపై ఆరేశాడు. దగ్గరలోని కరెంటు తీగా ఉండడంతో విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో రోడ్డున పడ్డమని సిమెంట్ గోడౌన్ యాజమాన్యం ఆదుకోవాలని వారు కోరారు.
News August 25, 2025
VZM: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. విజయగనరం జిల్లాలో 5,68,277 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదరులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది