News August 24, 2025

సౌతాఫ్రికా చరిత్రలోనే ఘోర వన్డే ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 431 రన్స్ చేసింది. ఛేదనలో SA 155 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో 276 రన్స్ తేడాతో ఓడిపోయింది. రన్స్ పరంగా వన్డేల్లో ఇది సౌతాఫ్రికాకు అతిపెద్ద ఓటమి. అంతకుముందు 2023 వరల్డ్‌కప్‌లో భారత్‌ చేతిలో 243 రన్స్‌ తేడాతో ఓడింది. కాగా AUSపై తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Similar News

News August 25, 2025

కొత్త రేషన్ కార్డులు.. నేటి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ

image

AP: నేటి నుంచి దశల వారీగా <<17506953>>కొత్త రేషన్<<>> కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రేషన్ పంపిణీలో లబ్ధిదారులకు పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలను అందించేందుకు క్యూఆర్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ఇవ్వనుంది. తొలి విడతలో ఇవాళ్టి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. రెండో విడతలో ఈ నెల 30 నుంచి మరో నాలుగు జిల్లాల్లో, మూడో విడతలో సెప్టెంబర్ 6 నుంచి ఐదు జిల్లాల్లో, 15 నుంచి 8 జిల్లాల్లో ఇవ్వనున్నారు.

News August 25, 2025

‘వినాయక చవితి’ ట్రెండ్ మారింది

image

గణేశ్ నిమజ్జనం రోజు చూసే వేడుకలు ఇప్పుడు వినాయకుడి ఆగమనం రోజున కనిపిస్తున్నాయి. విగ్రహాలను కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొస్తున్న సమయంలోనూ యువత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజే మ్యూజిక్, ఫైర్ వర్క్స్, రంగులు చల్లుకుంటూ బొజ్జ గణపయ్యకు ఆహ్వానం పలుకుతున్నారు. నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ గ్రామాలకు విస్తరిస్తోంది. ఏమైనప్పటికీ విద్యుత్ వైర్ల కింద నుంచి, రహదారులపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

News August 25, 2025

ఆగస్టు 25: చరిత్రలో ఈ రోజు

image

1952: తమిళ నటుడు విజయ్ కాంత్ జననం
1953: పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి మరణం
1994: రెజ్లర్ వినేశ్ ఫొగట్ జననం
1999: తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ మరణం
2007: గోకుల్ చాట్, లుంబినీ పార్కులో ముష్కరుల బాంబు దాడి.. 42 మంది మృతి
2012: చంద్రుడిపై కాలు పెట్టిన తొలి మనిషి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం(ఫొటోలో)