News August 24, 2025

ఆయుధాలు వాడకుండా ఉక్రెయిన్‌పై US ఆంక్షలు!

image

USమేడ్ లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్‌(ATACMS)ని ఉక్రెయిన్ వాడకుండా అమెరికా ఆపుతోందని WSJ పేర్కొంది. రష్యాపై ATACMS వాడేందుకు US అనుమతి కావాలని షరతు పెట్టినట్లు తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపలేకపోయానని ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మరోవైపు రష్యాపై టారిఫ్స్ వేయడం లేదా శాంతి చర్చల నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

Similar News

News February 15, 2026

పుతిన్ యుద్ధానికి బానిస: జెలెన్‌స్కీ

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి బానిస అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ దేశంలో ప్రతి పవర్ ప్లాంటును రష్యా ధ్వంసం చేసిందని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని చెప్పారు. హంగేరీ PM విక్టర్‌కు పొట్ట ఎలా పెంచుకోవాలో తెలుసని, రష్యా ట్యాంకులను ఆపడానికి సైన్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఎద్దేవా చేశారు.

News February 15, 2026

పాక్‌తో ఇవాళే మ్యాచ్.. చక్ దే ఇండియా!

image

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు వేళయింది. T20 WCలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు <<19134206>>మ్యాచ్ ప్రారంభం<<>> కానుంది. ఈ టోర్నీ చరిత్రలో పాక్‌తో ఆడిన 8 మ్యాచుల్లో 7 మన జట్టే గెలిచింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ టీమ్‌ను మట్టికరిపించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో అభిషేక్, సూర్య, బౌలింగ్‌లో బుమ్రా, వరుణ్ చెలరేగితే గెలుపు మనదే. చక్ దే ఇండియా!

News February 15, 2026

శివ నామాలు అర్థాలు ‘‘కాలభైరవ’’

image

శివుని ఉగ్ర రూపాలలో ‘కాలభైరవుడు’ శక్తివంతమైనది. ‘కాల’ అంటే సమయం అని అర్థం. సమయాన్ని శాసించేవాడు, కాలాన్ని మింగేసేవాడు కాబట్టి ఆయన కాలభైరవుడు. ముఖ్యంగా కాశీ క్షేత్రానికి ఈయనే రక్షకుడు(క్షేత్ర పాలకుడు). తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించే అధికారం ఈయనకు ఉంటుంది. భక్తుల భయాన్ని పోగొట్టి, శత్రువుల నుంచి రక్షించే దైవం ఈయన. మనలోని అహంకారాన్ని అంతం చేసి మోక్షమార్గాన్ని చూపే దైవంగా ఈయనను ఆరాధిస్తారు.